పాపం సాయి సినిమాకు మళ్ళీ కష్టాలు..!!

పాపం సాయి సినిమాకు మళ్ళీ కష్టాలు..!!

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోగా నిలదొక్కుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.  వరసగా అవకాశాలు వస్తున్నా.. సినిమాలు మాత్రం ఆశించినంతంగా ఆడటంలేదు.  దీంతో సాయి ధరమ్ తేజ్ స్టాండ్ అయ్యేందుకు కొంతసమయం పట్టేలా ఉంది.  కాగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు మంచి బ్రేక్ ఇచ్చిన కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యు సినిమా చేస్తున్నాడు.  ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ తో సినిమా అనగానే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.  సినిమాపై అంచనాలు పెరిగాయి.  

పైగా ఈ సినిమా ఆడియోవేడుకకు మెగాస్టార్ వచ్చి సాయిని ఆశీర్వదించాడు.  దీంతో సినిమా బిజినెస్ తో పాటు సక్సెస్ ఖాయం అనుకున్నారు.  సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి.. జూన్ 29 న విడుదల చేయాలని మొదట ప్లాన్ చేశారు.  ప్లాన్ ప్రకారమే షూట్ చేస్తున్నారు.  కానీ, కొన్ని కారణాల వలన సినిమాను జూన్ 29 నుంచి జులై 6 కు వాయిదా వేశారు.  సాయికి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోన్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ సంస్థ నిర్మిస్తోంది.