పాపం డైలాగ్ కింగ్.. రెండోసారి కూడా..

పాపం డైలాగ్ కింగ్.. రెండోసారి కూడా..

నువ్వానేనా అన్నట్లు సాగిన కర్ణాటక ఎన్నికలు చాలామందికి షాక్‌నిచ్చాయి. గెలుస్తామని అనుకున్న ఎంతోమంది అభ్యర్థులు బొక్కబోర్లా పడ్డారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మూడు ప్రధాన పార్టీల్లోని కొద్దిమందికి ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఇక తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో థియేటర్లలలో కేకలు పుట్టించి.. కలెక్షన్ల వర్షం కురిపించిన డైలాగ్ కింగ్ సాయికుమార్.. కర్ణాటక ఎన్నికల్లో అట్లర్ ఫ్లాపయ్యారు.. ఈ ఎన్నికల్లో బాగేపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి చేతిలో సాయికుమార్ చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఎంతలా అంటే కనీసం డిపాజిట్ దక్కలేదు.. కాంగ్రెస్, సీపీఎం, జేడీఎస్ తొలి మూడు స్థానాల్లో నిలిస్తే.. బీజేపీ ఇక్కడ నాలుగో స్థానానికి పరిమితమైంది. కాగా, 2008 ఎన్నికల్లో సైతం ఆయన ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సాయికుమార్ పరాజయంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.