సాయి పల్లవి పెళ్లి గురించి అడిగితే.. ఏం చెప్పిందో తెలుసా..?

సాయి పల్లవి పెళ్లి గురించి అడిగితే.. ఏం చెప్పిందో తెలుసా..?

సాయి పల్లవి ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. మలయాళంలో ప్రేమమ్ సినిమా చేసిన సాయి పల్లవి తెలుగులో 2017 లో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.  పైగా మొదటి సినిమాకే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.  భానుమతి ఒక్కటే పీస్ అంటూ చెప్పిన డైలాగులు థియేటర్లో చప్పట్లు కొట్టించాయి.  తెలంగాణ యాసలో మాట్లాడిన తీరు ఆకట్టుకోవడంతో సినిమా హిట్టైంది.  ఆ తరువాత తెలుగులో నానితో ఎంసిఏ, శర్వానంద్ తో పడిపడిలేచే మనసు చేసింది.  చివరి సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.  అటు తమిళంలో కూడా వరసగా సినిమాలు చేస్తోంది.  

రీసెంట్ గా ధనుష్ తో మారి 2 చేసింది.  మారి సినిమాకు కొనసాగింపుగా వచ్చిన సినిమా అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  ఇప్పుడు సూర్యతో ఎన్.జీ.కే లో చేస్తోంది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాను అని జవాబు ఇచ్చింది.  చాలామంది ఇలాంటి జవాబులు చెప్తూనే ఉంటారు.  చివరి పెళ్లి చేసుకొని సెటిలైపోతుంటారు.  మరి సాయి పల్లవి కూడా అలాగే చేస్తుందా లేదంటే చెప్పిన మాటకు కట్టుబడి ఉంటుందా చూద్దాం.