ఫామ్‌లో ఉన్న హీరోయిన్.. పెళ్లే వద్దంటోంది !

ఫామ్‌లో ఉన్న  హీరోయిన్.. పెళ్లే వద్దంటోంది !

తెలుగునాట అతి తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి.  'ఫిదా' సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిన ఈమె ఆ తర్వాత వచ్చిన 'ఎంసిఏ, పడి పడి లేచే మనసు' లాంటి చిత్రాలతో మరింత దగ్గరైంది.  కెరీర్లో ఇంత వేగంగా ఎదిగిన ఈమె పెళ్లి మాత్రం చేసుకోనంటోంది.  ఎప్పటికీ తన తల్లిదండ్రులతో ఉండి వారి బాగోగులు చూసుకోవడమే తనకిష్టమని అంటోంది.  ప్రెజెంట్ సూర్యతో 'ఎన్.జి.కె' చిత్రం చేస్తున్న ఈమెకు చాలా ఆఫర్లు చేతిలో ఉన్నాయి.  అయితే తొందరపడి వేటికీ సైన్ చేయకుండా ఆచి తూచి ప్రాజెక్ట్స్ ఎంచుకొంటోంది ఈ మలయాళ బ్యూటీ.