కోరిక తీర్చలేదని కడతేర్చాడు..

కోరిక తీర్చలేదని కడతేర్చాడు..

హైదరాబాద్ లోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి ప్రగతి రిసార్ట్‌లో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కొత్తూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన శిరీష (20) అనే డిగ్రీ విద్యార్థిని ఈ ఘటనలో బలైంది. ఈ అమ్మాయి స్నేహితుడు సాయి ప్రసాద్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న శిరీష, సాయిప్రసాద్ ఇద్దరూ స్నేహితులు. గతంలో కొన్ని సార్లు తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను బలవంతం చేశాడు సాయిప్రసాద్. తనకు ఇప్పుడే వివాహం ఆలోచన లేదని.. బాగా చదువుకోవాలన్న విషయాన్ని ఆమె చెబుతూ వచ్చింది. దీంతో.. శిరీషపై ఆగ్రహం పెంచుకున్న సాయిప్రసాద్.. ఓ పథకం ప్రకారం ఆమెను గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రగతి రిసార్ట్స్ కు తీసుకెళ్లాడు.

ఆ మాటా ఈ మాటా చెప్పి... లైంగిక దాడికి యత్నించాడు. శిరీష ఈ విషయంపై తీవ్రంగా ప్రతిఘటించింది. దాదాపు మూడు గంటల పాటు ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించిన సాయిప్రసాద్ ఎట్టకేలకు  విఫలమయ్యాడు. అక్కడ నుంచి బైటకు వెళ్తే విషయం అందరకూ తెలుస్తుందన్న భయంతో సాయి ప్రసాద్, ఆమె గొంతుకోసి హతమార్చాడు. ఆ తర్వాత సాయిప్రసాద్ బయటకు వెళ్లిపోగా.. అక్కడ విగతజీవిగా పడివున్న శిరీషను గమనించిన రిసార్ట్ నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సాయిప్రసాద్ తమ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు సాయి ప్రసాద్ ను విచారిస్తున్న పోలీసులు మరిన్ని విషయాలను రాబడుతున్నట్లు  హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జన్నార్ తెలిపారు. కానీ.. బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం మేం పోన్ చేసేంతవరుకు పోలీసులు విషయం తెలపలేదని.. కేస్ ఫైల్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాలని వెల్లడిస్తున్నారు. గతంలో ఇంటర్ చదివేప్పుడు సాయిప్రసాద్ వేధించినప్పుడు పిలిచి మందలించామని వారు తెలిపారు. ఇంకా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.