సల్మాన్ ను కంటతడి పెట్టించిన మెసేజ్

సల్మాన్ ను కంటతడి పెట్టించిన మెసేజ్

రీల్ లైఫ్ లో సల్మాన్ ఖాన్ ఎన్నోసార్లు కంటతడి పెట్టి ఉంటాడు.  పాత్రకు తగినట్టుగా నటించే క్రమంలో ఒదిగిపోయే నటించే సమయంలో తెలియకుండానే కంటతడి పెడతారు.  సల్మాన్ ఖాన్ ఎన్నో గొప్పగొప్ప పాత్రల్లో నటించి మెప్పించాడు.  దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ తన తండ్రి ముందు ఎప్పుడు ఒదిగే ఉంటాడు.  పెద్దవాళ్ళ దగ్గర ఒదిగివుంటే ఈ లక్షణమే గొప్పవాడిని చేసింది.  వెండితెరపై వెలుగులు పండిస్తున్న సల్మాన్, బుల్లితెరపై కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు.  

సోని సంస్థ నిర్మిస్తున్న దస్ కా దమ్ ప్రోగ్రామ్ కు వ్యాఖ్యాతగా ఉన్న సంగతి తెలిసిందే.  అయితే, ఫాదర్స్ డే సందర్భంగా జరిగిన ప్రోగ్రామ్ మధ్యలో సల్మాన్ కు అతని తండ్రి ఓ సర్పైజ్ మెసేజ్ ఇచ్చాడు.  "తండ్రి కొడుకుల అనుబంధానికి నిర్వచనం చెప్పడం చాలా కష్టం.  ఆప్యాయతతో కూడిన ప్రేమ, ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలోనే అనుబంధాలు కొనసాగుతాయి.  డబ్బును ఎలాగైనా సంపాదించుకోవచ్చు.. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, గౌరవాన్ని నిలుపుకోవడం ముఖ్యం" అనే చిన్న మెసేజ్ సల్మాన్ కంట తడి పెట్టించింది.