'దబాంగ్ 3' రెడీ అవుతోంది !

'దబాంగ్ 3' రెడీ అవుతోంది !

సల్మాన్ ఖాన్ కెరీర్లోని సూపర్ హిట్ సినిమాల్లో 'దబాంగ్' ప్రాంచైజీ కూడ ఒకటి.  2010లో అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'దబాంగ్' భారీ విజయాన్ని అందుకుంది.  ఆ తరవాత దాని అర్భాజ్ ఖాన్ డైరెక్షన్లో వచ్చిన సీక్వెల్ 'దబాంగ్ 2' కూడ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.  ఇప్పుడు రానున్న మూడవ భాగాన్ని ప్రభుదేవా డైరెక్ట్ చేయనున్నాడు.  ఏప్రిల్ నుండి ఈ చిత్రం మొదలవుతుందని నిర్మాత అర్భాజ్ ఖాన్ తెలిపారు.  ఇదొక రీమేక్ అని లేదు నొయిడాలోని ఒక పోలీస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా రూపొందనుందని వస్తున్న వార్తలపై స్పందించిన అర్భాజ్ అసలు విషయాన్ని త్వరలోనే రివీల్ చేస్తానని అన్నారు.