వాళ్ళు ఒప్పుకోలేదు .. అందుకే చైతన్యతో పోటీ - సమంత

వాళ్ళు ఒప్పుకోలేదు .. అందుకే చైతన్యతో పోటీ - సమంత

ఈ నెల 13న బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు ఢీకొనబోతున్నాయి.  ఇలాంటి పోటీ ఎప్పుడూ ఉండేదే అయినా ఈసారి మాత్రం కొంచెం ప్రత్యేకం.  ఎందుకంటే ఈసారి భార్యాభర్తలైన నాగచైతన్య, సమంతలు పోటీకి దిగుతున్నారు.  చైతన్య మారుతితో చేసిన 'శైలజారెడ్డి అల్లుడు'తో వస్తుంటే సమంత 'యుటర్న్'తో బరిలో నిలిచింది. 

ఎందుకు భర్తతో పోటీ అంటే సమంత సమాధానం చెబుతూ 'మా దర్శకుడు పవన్, నిర్మాత ఇద్దరూ 13న సినిమాను విడుదలచేయాలని ముందే నిర్ణయించుకున్నారు.  అందుకే ఇప్పుడు డేట్ మార్చడానికి ఒప్పుకోవడంలేదు.  దీంతో చైతన్యతో పోటీ తప్పడంలేదు.  ఏది ఏమైనా రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను' అన్నారు.