రాజమౌళి సినిమా గురించి సమంత ఏమందంటే !

రాజమౌళి సినిమా గురించి సమంత ఏమందంటే !

దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో చేయాల్సిన మల్టీస్టారర్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఇన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ గురించి వినిపించిన రకరకాల వార్తల్లో ఇందులో నటించబోయే హీరోయిన్లలో సమంత కూడ ఒకరు అనేది కూడ ఉంది.  

తాజాగా 'యు టర్న్' ప్రమోషన్లలో భాగంగా  మీడియాతో మాట్లాడిన ఆమె ఆ సినిమాలో తాను నటించడంలేదని, ఆ వార్తలనీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చారు.  ఇకపోతే ఈమె అక్టోబర్ నెలలో మొదలుకాబోయే కొత్త సినిమా షూటింగ్లో నాగ చైతన్యతో కలిసి పాల్గొననున్నారు.