కూరగాయల దుకాణంలో సమంత..

కూరగాయల దుకాణంలో సమంత..

సమంత ఇప్పుడు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్.  ఆమె నటించిన సినిమాలు వరసగా హిట్ అవుతున్నాయి.  హీరోయిన్ కంటే ముందు ఆమె ఒక మహిళ.  అందరిలాగే ఆమెకు కొన్ని కోరికలు ఉంటాయి కదా.  సమంతకు కూరగాయలు అమ్మాలని ఓ వింత కోరిక కలిగింది.  వెంటనే చెన్నైలోని తిరువల్లిక్కేణి ప్రాంతంలోని ఓ కూరగాయల మార్కెట్ కు వెళ్లి.. అక్కడ దుకాణంలో ఉన్న ఆమెకు తన కోరిక తెలిపింది.  

సమంత వంటి పెద్ద హీరోయిన్ అడిగితే కాదంటుందా చెప్పండి.. వెంటనే ఒకే చెప్పింది.  సమంత దుకాణంలో కూర్చొని కూరగాయల ధరలు చెప్తూ అందరిని దృష్టిని ఆకర్షించింది.  ఇంకేముంది.. దుకాణంలో సమంత కూరగాయలు అమ్ముతుందని తెలుసుకున్న వినియోగదారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కూరగాయలు కొనేశారు.  కొద్దీ సేపట్లోనే దుకాణంలోని కూరగాయలన్ని అమ్ముడుపోయాయి.  సమాజ సేవ కోసం సమంత పని చేసింది.  గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యం కోసం ఈ వ్యాపారం చేసినట్టు సమంత చెప్తున్నది.