మగాళ్లకు పోటీగా సమంత..!!

మగాళ్లకు పోటీగా సమంత..!!

పురుషులకు.. స్త్రీలకు మధ్య అనేక విషయాల్లో చాలా తేడాలు ఉంటాయి.  పురుషులు ఎత్తగలిగే బరువులు స్త్రీలు ఎత్తలేరు.  వాళ్ళ శరీర సౌష్టవం వేరు.. వీళ్ళ శరీర సౌష్టవం వేరు. ఆడవాళ్లు సిన్నితంగా ఉంటారు.  అందులో హీరోయిన్లు మరింత సుకుమారంగా ఉంటారు.  రోజు జిమ్ కు వెళ్లి వర్కౌట్ చేస్తున్నా.. శరీరాన్ని మాత్రం నాజూకుగా ఉంచుకోవడానికి ఆసక్తి చూపుతారు.  చిన్న చిన్న డంబెల్స్, తక్కువ బరువు ఉండే వెయిట్ లిఫ్ట్ లను ఎత్తుతూ శరీరాన్ని ఫిట్ గా  ప్రయత్నిస్తుంటారు.  

సమంత మాత్రం అందుకు విరుద్ధం.  తన శరీరానికి మించిన బరువులను ఎత్తుతూ మగాళ్లకు పోటీగా నిలుస్తున్నది.  80 కేజీల వెయిట్ లిఫ్ట్ ను ఎత్తడం అంటే మామూలు విషయం కాదు.  ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్స్ మాత్రమే అలాంటి బరువులు ఎత్తడం సాధ్యం అవుతుంటుంది.  అలాంటిది సమంత అంతటి బరువులను అవలీలకు ఎత్తుతూ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది.  అలా బరువులు ఎత్తుతుండగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది.  ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.