దేవుడా! ఆ ఎక్స్‌ప్రెష‌న్ అందుకే!

దేవుడా! ఆ ఎక్స్‌ప్రెష‌న్ అందుకే!

దేవుడా నువ్వు బావుండు..  నువ్వే బావుండు..! అన్న‌ మ‌హేష్ ప్రార్థ‌నకు పూర్తి వ్య‌తిరేకంగా ప్రార్థించింది స‌మంత‌. వ‌రుస‌గా రెండు సినిమాలు రిలీజ్ క్యూలో ఉన్నాయి. అవి రెండూ నేను న‌టించిన‌వే.. అవ‌న్నీ హిట్లు అవ్వాల‌ని దీవించు.  దేవుడా హిట్లు ఇవ్వు.. వ‌రుస హిట్లు ఇవ్వు..! అంటూ వేడుకుంటోంది. ఈ భూమ్మీద ఉన్న స్వార్థ‌ప‌రుల గురించి బిజినెస్‌మేన్‌ ఎంతో క‌రెక్టుగా చెబితే ఆ మాట సామ్ చెవికి ఎక్క‌లేన‌ట్టుంది. 

అందుకే ఓ అభిమాని తెలివిగా స‌మంత ద‌ణ్ణం పెడుతున్న ఫోటో ఒక‌టి షేర్ చేసి వ‌రుస హిట్లివ్వాల‌ని ద‌ణ్ణం పెడుతోంద‌ని కామెంటును ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. స‌మంత న‌టించిన `మ‌హాన‌టి` మే 9న రిలీజ‌వుతోంది. విశాల్ స‌ర‌స‌న న‌టించిన `అభిమ‌న్యుడు` (ఇరుంబు తిరై) మే 11న రిలీజ్‌కి రెడీ అవుతోంది. రెండ్రోజుల గ్యాప్‌తో రెండు సినిమాలు వ‌స్తున్నాయి. అందుకే స‌మంత ఇలా దేవుని ప్రార్థ‌న‌లో ఉంది. అంతేకాదు లోలోన ఎంతో మ‌ద‌న‌ప‌డిపోతున్నాన‌ని స‌మంత తెలిపింది. ఒత్తిడి లేకుండా రెండు విజ‌యాలు నాకే కావాల‌ని స్వార్థం చూపించింది.