సమంతకు విపరీతంగా నచ్చిందట..!!

సమంతకు విపరీతంగా నచ్చిందట..!!

కొన్ని సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.  అలాంటి అరుదైన, హృదయానికి ఆకట్టుకునే విధంగా వచ్చిన సినిమాల్లో కేరాఫ్ కంచరపాలెం కూడా ఒకటి.  దగ్గుబాటి రానా సమర్పణలో వెంకటేష్ మహా అనే దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాను సెలబ్రిటీలు ఎందరో ప్రశంసించారు.  నిజజీవితానికి దగ్గరగా, సున్నితమైన కథలతో ఆకట్టుకునే విధంగా సినిమాను చిత్రీకరించారు.  ఈ సినిమాపై సమంత పొగడ్తల వర్షం కురిపించింది.  

ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయని, హృదయానికి హత్తుకునే విధంగా విలువలతో కూడిన సినిమా అని అందరు తప్పకుండా చూడాల్సిన సినిమాల్లో ఇది ఒకటిగా ఉంటుందని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.  

కేరాఫ్ కంచరపాలెంకు క్రిటిక్స్ కూడా పాజిటివ్ గానే ఉండటంతో థియేటర్స్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టుతున్నది.