సమంత అప్పుడే మొదలుపెట్టింది..!!

సమంత అప్పుడే మొదలుపెట్టింది..!!

సమంత పెళ్ళైన తరువాత వరస ఆఫర్లతో దూసుకుపోతున్నది.  ఈ ఏడాది వరస హిట్స్ అందుకున్న హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు యూటర్న్, సీమరాజా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  యూటర్న్ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుండటంతో.. సమంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది.  

అటు సీమరాజాకు కూడా తమిళంలో పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతున్నది. ఈ సినిమాలో సమంత మొదటిసారి సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నది.  ఇది ఈ సినిమాకు ప్లస్ అవ్వొచ్చు.  అటు కన్నడంలో సినిమా మంచి హిట్ కావడంతో.. తెలుగు, తమిళ రీమేక్ కూడా అదే రేంజ్ లో హిట్టయ్యే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.  యూటర్న్ థీమ్ సాంగ్ డ్యాన్స్ సోషల్ మీడియా ట్రేండింగ్ అవుతున్నది.  ఇలా థీమ్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సమంత రిప్లై ఇస్తూ బిజీగా ఉన్నది.