రేపు విడుద‌ల కానున్న గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లు

రేపు విడుద‌ల కానున్న గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లు

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం10, ఎం20, ఎం30, ఎం40లను సోమవారం భార‌త్‌లో విడుద‌ల చేయ‌నుంది. మార్చి 5 నుండి ఈ ఫోన్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అమెజాన్‌, శాంసంగ్ స్టోర్లలో ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్ర‌యించ‌నున్నారు. వీటి ధ‌ర వివ‌రాల‌ను కంపెనీ ఇంకా వెల్ల‌డించ‌లేదు. అయితే ఎం10 ధర రూ. 8,990లుగా (3జీబీ ర్యామ్ వేరియెంట్), ఎం 20 ధర  రూ.12,990లకు (4జీబీ ర్యామ్ వేరియెంట్) లభించనుందని సమాచారం తెలుస్తోంది. మొద‌ట గెలాక్సీ ఎం10, ఎం20 ఫోన్ల‌ను మాత్ర‌మే శాంసంగ్ విడుద‌ల చేస్తుంద‌ని సమాచారం రాగా.. ఎం30, ఎం50 ఫోన్ల‌ను కూడా విడుద‌ల చేస్తుంద‌ని తెలుస్తోంది. ఎం10, ఎం20, ఎం30, ఎం40లలో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీలు, ఫాస్ట్ చార్జింగ్‌, డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరా ఫీచ‌ర్లు అన్నింటిలో కామ‌న్‌గా ఉండనున్నాయి.

ఎం10 ఫీచ‌ర్లు:

# 6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
# 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
# ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7872 ప్రాసెస‌ర్‌
# 2/3 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్‌
# ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
# 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
# 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
# ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
# 3,400 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ఎం20 ఫీచ‌ర్లు:

# 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
# 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
# ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7885 ప్రాసెస‌ర్‌
# 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ (512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌)
# ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
# 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
# 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
# ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
# 5,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ఎం30 ఫీచ‌ర్లు:

# 6.38 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
# 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
# ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
# 4జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌
# 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
# 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
# ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
# 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ