ఏపిలో తలసాని పర్యటన

ఏపిలో తలసాని పర్యటన

మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపి పర్యటనకెళ్తున్నారు. 14, 15 తేదీల్లో రెండ్రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. 14న ఉదయం 7.00 గంటలకు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం గుండా విజయవాడకు బయలుదేరుతారు. 10గంటలకు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుండి స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా ఇంద్రకీలాద్రి వరకు వెళతారు.10.30 గంటలకు  బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకుంటారు. అనంతరం తలసాని విజయవాడ నుండి భీమవరం చేరుకొని అక్కడి ప్రసిద్ధ మావురాలమ్మను దర్శించుకొని  రాత్రి అక్కడే బస చేస్తారు. 15న హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.