కేజీఎఫ్ 2లో సంజయ్ దత్

కేజీఎఫ్ 2లో సంజయ్ దత్

కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా సూపర్ హిట్టైంది.  కన్నడంతో పాటు దక్షిణాది భాషల్లోను సత్తా చాటింది.  అటు బాలీవుడ్ లోను ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కేజీఎఫ్ కు సీక్వెల్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతున్నది.  కేజీఎఫ్ 2  తీస్తామని చాలా రోజుల క్రితమే యూనిట్ ప్రకటించింది.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గాసాగుతున్నాయి.  

సీక్వెల్ కు సంబంధించిన ఓ  న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  సీక్వెల్ లో రమ్యకృష్ణ, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ లు కూడా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.  ఈ ఇద్దరు ఈ సినిమాలో నటిస్తే.. దక్షిణాదిన అలాగే బాలీవుడ్ నుంచి మంచి ఓపెనింగ్స్ వస్తాయనడంలో సందేహం లేదు.