విశాఖలో సంక్రాంతి సంబరాలు

విశాఖలో సంక్రాంతి సంబరాలు

విశాఖ వుడా చిల్డ్రన్ థియేటర్ లో ప్రభుత్వ అద్వర్యం లో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్.కళా కారులతో  కలిసి ఉత్సాహంగా డాన్స్ చేశారు.రాష్ట్ర ప్రజలు పెద్ద పండగైన సంక్రాంతి ని ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి మండలం, గ్రామంలో ని ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుతున్నామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వివరించారు.ఈ సంబరాల్లో పెద్ద సంఖ్యలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లోనే 10 మంది ప్రతిభావంతులకి మోటార్ వాహనాలను కలెక్టర్ చేతుల మీదుగా బహుకరించారు.