నళిని చిదంబరంపై సీబీఐ ఛార్జిషీట్

నళిని చిదంబరంపై సీబీఐ ఛార్జిషీట్

మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం భార్య నళిని చిదంబరంపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. శారద పోంజి కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగిందనే దర్యాప్తులో భాగంగా సీబీఐ నళిని చిదంబరంపై కోల్ కతాలోని బరాసత్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2010-2014 మధ్య నళిని చిదంబరం రూ.1.4 కోట్లు తీసుకున్నారు.

పోంజి స్కీమ్ స్కామ్ లో నళిని చిదంబరం రూ.1.4 కోట్లు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శారదా గ్రూపు యజమాని, ప్రమోటర్ అయిన సుదీప్త సేన్ తో కలిసి నళిని చిదంబరం కుట్ర చేశారని సీబీఐ ఆరోపించింది. వీళ్లిద్దరూ ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో వ్యవహరించారని, నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పింది. 

ఇది శారదా కుంభకోణంలో సీబీఐ దాఖలు చేసిన 6వ అనుబంధ చార్జిషీటు.