వందకోట్ల క్లబ్ లో సర్కార్..

వందకోట్ల క్లబ్ లో సర్కార్..

ఎన్నో అంచనాల మధ్య దీపావళి రోజున సర్కార్ సినిమా రిలీజ్ అయింది.  భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించకపోయినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతున్నది.  మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.56.90 కోట్లు వసూలు చేసిన సర్కార్, రెండో రోజుకూడా అదే హవాను కొనసాగించింది.  

రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.110 కోట్లు వసూలు చేసి భళా అనిపించింది.  తమిళనాడులో రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి.  రజినీకాంత్ కాలా సినిమా కలెక్షన్లను బీట్ చేసిన సర్కార్.. త్వరలోనే రెండు వందల కోట్ల క్లబ్ లోనే చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.