సర్కార్ సేఫ్ అయినట్టే..!!

సర్కార్ సేఫ్ అయినట్టే..!!

దీపావళి సందర్భంగా సర్కార్ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే.  తమిళనాడులో విజయ్ సినిమాలకు భారీ డిమాండ్ ఉన్నది.  అంతేకాదు, అక్కడ భారీ ఎత్తున రిలీజ్ అయింది కూడా.  రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.  మొదటిరోజు ప్రదర్శించిన దూకుడును రెండో రోజుకూడా కొనసాగించింది.  

రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.09 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది. టోటల్ గా రెండు రోజుల్లో రూ.4.40 కోట్ల షేర్ ను రాబట్టింది.  మరో మూడు కోట్లు షేర్ రాబట్టగలిగితే.. సేఫ్ అయినట్టే.  ఇంకో వారం రోజులవరకు తెలుగు సినిమాలు లేకపోవడం సర్కార్ కు కలిసివచ్చే అంశంగా మారింది.  

మొదటిరోజు కేరళ సర్కార్ భారీ వసూళ్లు రాబట్టినా రెండో రోజు వచ్చే సరికి కలెక్షన్లు పూర్తగా పడిపోయాయి.  రెండో రోజు కేవలం రూ.1.60 కోట్ల గ్రాస్ ను మాత్రమే సాధించింది.