సూర్య సరసన అఖిల్ హీరోయిన్ ?

సూర్య సరసన అఖిల్ హీరోయిన్ ?

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో NGK సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఇంకో రెండు నెలలో ఈ సినిమా పూర్తి కానుండడంతో తన తదుపరి సినిమా పనులను సూర్య మొదలెట్టారు. క్రియేటివ్ డైరెక్టర్ కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఈ కొత్త సినిమా ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్య సరసన సయేశా నటించనుందని తెలుస్తోంది. ఈ ముద్దు గుమ్మ అఖిల్ నటించిన హలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. 

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మల్టీ స్టారర్ తరహాలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించనున్నాడు. మన తెలుగు హీరో అల్లు శిరీష్ కూడా ఈ ప్రాజెక్టులో నటించనున్నాడు. గతంలో కేవీ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇటు సూర్యతో చేసిన వీడోక్కడే, బ్రదర్స్ సినిమాలు మంచి బాగుండడతో ఈ కొత్త ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సూర్య ప్రస్తుతం చేస్తున్న NGK సినిమా దీపావళీ నాటికి ప్రేక్షకుల ముందుకు రానుంది.