ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ కోటా రాష్ట్రాలకూ వర్తింపు...

ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ కోటా రాష్ట్రాలకూ వర్తింపు...

ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్ల కోటాను సుప్రీంకోర్టు తిరిగి అనుమతిఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇది వర్తింపజేయాలని తెలిపారు కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్... సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వర్తించాలా వద్దా అనేదానిపై కొంత గందరగోళం ఉండేది... కానీ, ఇప్పుడు గందరగోళం లేదు... కేంద్రం, రాష్ట్రాలు ప్రమోషన్లో రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తాయని ఆయన వెల్లడించారు. 

కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలో నిన్న సమావేశమైన మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ భేటీకి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సామాజిక న్యాయ శాఖ మంత్రి గెహ్లాట్, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు, సిబ్బంది, శిక్షణా విభాగం శాఖల అధికారులు హాజరయ్యారు. అనంతరం పాశ్వాన్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అన్ని ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండాలని తమ పార్టీ ఎల్‌జీపీ నిర్ణయించిందన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి కూడా రిజర్వేషన్ వర్తింపజేయాలన్న ఆయన... అగ్రకులాలకు చెందిన ప్రజలు తమ కుమార్తెలను దళితులకు ఇచ్చి వివాహం చేసినప్పుడే నిజమైన మార్పు రావొచ్చు అన్నారు.