పదవుల వేలంపై డిజిపికి ఎస్ఈసీ లేఖ

పదవుల వేలంపై డిజిపికి ఎస్ఈసీ లేఖ

పంచాయతీ ఎన్నికల్లో పదవుల వేలంపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీస్ శాఖ కోరింది.ఈ మేరకు ఎస్ఈసీ డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాసింది. వికారాబాద్ జిల్లా బోజ్యానాయక్ తండాలో వేలం ఉదంతాన్ని ప్రస్తావించిన ఎన్నికల సంఘం,ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహాలో ప్రలోభాలు కొనసాగుతున్నాయని లేఖలో పేర్కొంది.పదవులు వేలం వేసినా, అక్రమాలకు పాల్పడినా,ప్రభావితం చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఎన్నికల సంఘం సంఘం హెచ్చరించింది. అందుకు అనుగుణంగా పదవుల వేలంపై తగిన చర్యలు  తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలో కోరింది.ఈ మేరకు అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం డిజిపి మహేందర్ రెడ్డికి సూచించింది.