చంద్రబాబు కు ఆజాద్ సంఘీభావం

చంద్రబాబు కు ఆజాద్ సంఘీభావం

ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత గులాం నబీ ఆజాద్  సంఘీభావం తెలిపారు. సభలో అజాద్ మాట్లాడుతూ.. చంద్రబాబుతో తనకు చాలా కాలంగా సాన్నిహిత్యం ఉందని అన్నారు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఒకరంటే ఒకరికి గౌరవం ఉందని చెప్పారు. దేశం కోసం.. దేశ సమగ్రత కోసం ఆలోచనే చేయని తొలి ప్రధానిగా మోడీ పేరు తెచ్చుకున్నారని గులాం నబీ ఆజాద్ అన్నారు. తమిళ రైతులు పుర్రెలతో చేసిన ఆందోళనలు తన జీవితంలో తొలిసారి చూశానని..కానీ మోడీ చలించ లేదని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో  రైతుల భారీ ఆందోళనలను మోడీ పట్టించుకోని నిరంకుశుడని విమర్శించారు. జమ్ము కాశ్మీర్లో ఎన్నడూ జరగనన్ని సంఘటనలు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ  హాయాంలోనే జరుగుతున్నాయని ఆజాద్ ఆరోపించారు. బార్ రూమ్, రెస్టారెంట్లల్లో స్పీకర్..సీఎంలను డిసైడ్ చేసే పరిస్థితి ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొందన్నారు.ఏపీ డిమాండ్లు, ప్రత్యేక హోదాకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు.ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామిగా ఉంటారని చెప్పుకొచ్చారు.