'గీత గోవిందం' నా సినిమాకి కాపీ అంటున్న సీనియర్ డైరెక్టర్ !

'గీత గోవిందం' నా సినిమాకి కాపీ అంటున్న సీనియర్ డైరెక్టర్ !

ఇటీవల విడుదలైన 'గీత గోవిందం' చిత్రం ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.  పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలుచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.  ఈ సినిమా గురించి సీనియర్ స్టార్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావ్ మాట్లాడుతూ పరశురామ్ తన 'పెళ్లి సందడి' చిత్రాన్ని కాపీ కొట్టారని సరదాగా కామెంట్ చేశారు. 

20 ఏళ్ల క్రితం అల్లు అరవింద్, తాను కలిసి 'పెళ్లి సందడి' చిత్రాన్ని చేశామని, ఒక్క ముద్దు సీన్ కూడ లేకుండా సినిమా తీయడం ఎంత కష్టమో తనకు తెలుసని, అలాంటిది పరశురామ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారని అభినందించారు.