చంద్రబాబుపై భారీ కుట్ర జరుగుతోంది

చంద్రబాబుపై భారీ కుట్ర జరుగుతోంది

ఏపీ సీఎం చంద్రబాబుకు బాబ్లీ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ నోటీసులు రావడం అన్యాయమని సినీనటుడు శివాజీ తెలిపారు. నోటీసులకు భయపడి మహారాష్ట్రకు వెళితే మిమ్మల్ని ఉచ్చులోకి దింపుతారని హెచ్చరించారు. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించాలని హితువు పలికారు. 

చంద్రబాబు మీద భారీ కుట్ర జరుగుతోంది.. ఇది అమానుషం. త్వరలో చంద్రబాబుకు మరో రెండు, మూడు నోటీసులు వస్తాయి. రెండో నోటీసు సిద్ధంగా ఉంది. మోదీకి ఎవరైనా ఎదురు మాట్లాడుతున్నారంటే అది చంద్రబాబే. ఐక్య రాజ్యసమితిలో చంద్రబాబుకు మాట్లాడే అవకాశం వచ్చింది. రాష్ట్రానికి రావాల్సిన ఆపిల్‌ సంస్థ రాకుండా బీజేపీ అడ్డుకుందని ఆయన ఆరోపించారు. 

రాష్ట్రానికి రాజధాని లేదు.. ఉపాధిలేదు.. పరిశ్రమలు లేవు. పోలవరం మధ్యలో ఉంది.. కియా మోటార్స్‌ ప్రారంభం కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కుట్రలు అవసరమా? ఈ సమయంలో రాజకీయ సంక్షోభం వస్తే రాష్ట్రం నిలువునా మునిగిపోతుంది. మోదీ 30శాతం ఓట్లతో ప్రధాని అయ్యారని, నేను చెప్పేది తప్పో..ఒప్పో.. ఆలోచించండి అని శివాజీ తెలిపారు.