స్థిరంగా ట్రేడ‌వుతున్న నిఫ్టి

స్థిరంగా ట్రేడ‌వుతున్న నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా ఉండ‌టంతో నిఫ్టి స్థిరంగా ట్రేడ‌వుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో క్లోజ‌య్యాయి. నాస్‌డాక్ దాదాపు రెండు శాతం న‌ష్టంతో ముగిసింది. కార్పొరేట్ ఫ‌లితాలు మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్ల‌లోనూ  న‌ష్టాలు కొన‌సాగుతున్నాయి. అయితే నష్టాలు నామ మాత్రంగానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో నిఫ్టి 10,920 ప్రాంతంలో ట్రేడ‌వుతోంది. కాస్త హెచ్చుత‌గ్గుల‌కు లోనైనా స్థిరంగా ట్రేడ‌వుతోంది. నిఫ్టి షేర్ల‌లో జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, జేఎస్‌డ‌బ్ల్యూస్టీల్‌, ఎస్ బ్యాంక్‌, హిందాల్కో, టాటా స్టీల్ లాభాల్లో ఉన్నాయి. ఇక నిఫ్టి షేర్లలో న‌ష్టాల్లో ముందున్న షేర్లలో కొట‌క్ బ్యాంక్‌, స‌న్ ఫార్మా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. నిన్న భారీగా న‌ష్ట‌పోయిన ప్రభాత్ డెయిరీ షేర్లు ఇవాళ కూడా న‌ష్టాల్లోనే కొన‌సాగుతున్నాయి. భీమా రంగ కంపెనీలు కూడా ఇవాళ భారీ న‌ష్టాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండ‌ర్డ్ షేర్లు న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి.