హిందూ మహిళ కర్మకాండలకు నో... ఎందుకంటే

హిందూ మహిళ కర్మకాండలకు నో... ఎందుకంటే

ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మహిళ హిందువు కాదని ఆమె కర్మకాండలను ఢిల్లీలోని కాళీ మందిర్ టెంపుల్ సొసైటీ తిరస్కరించింది. ఆమె హిందువు కాదని, హిందూ సంప్రదాయం కారం ఆమె కర్మకాండలను నిర్వహించలేమని సొసైటీ తేల్చి చెప్పింది. కోల్‌కతాకు వాసి ఇంతియాజుర్‌ రెహమాన్‌ హిందువైన నివేదితను పెళ్లి చేసుకున్నారు. ఆమె బెంగాలీ. వివాహం తర్వాత కూడా నివేదిత హిందువుగానే కొనసాగారు. ఆమె  మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ కావటంతో నివేదిత ఇటీవల మృతి చెందారు. ఆమె కోరిక ప్రకారం హిందూ సంప్రదాయాల ప్రకారమే ఆమె పన్నెండు రోజుల కర్మాకాండలు చేయాలని భర్త నిశ్చయించారు.

చిత్తరంజన్‌ పార్క్‌ ప్రాంతంలోని కాళీ మందిర్‌ ఆలయ సొసైటీలో స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. ఆగస్టు 12న తేదీన కార్యక్రమం నిర్వహించేందుకు రూ.1300 చెల్లించారు. నిర్వహకులు గోత్రం అడగడంతో తడబడ్డారు. దీంతో అనుమానం వచ్చి పరిశీలించగా అతడు ముస్లిం అని తెలిసింది. ఇంతియాజుర్‌కు  స్లాట్‌ను రద్దు చేశామని తెలిపారు. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మహిళ హిందువు కాబోదని సంప్రదాయం ప్రకారం తాము కార్యక్రమం నిర్వహించడానికి అంగీకరించమని సొసైటీ నిర్వహకులు తెలిపారు. నా భార్య మొదటి నుంచీ హిందూ సంప్రదాయాలే పాటించిందని తెలిపినా...  సొసైటీ ససేమిరా అంది. మతానికి, వివాహానికి సంబంధం ఏముందని ఆయన ప్రశ్నించారు. తన భార్య చివరి కోరిక మేరకు కర్మకాండలను ఈ విధంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యానని.. కానీ తనను అనుమతించడం లేదని రెహ్మాన్ తెలిపారు.