ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం

ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం

ఎన్నికల సమయంలో సెంటిమెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కావల్సిన వారు ఎదురురావడమో.. లేకపోతే ఫలానా ప్రాంతం నుంచి ప్రచారం ప్రారంభిస్తే తనకు తిరుగుండదనో ఇలా రకరకాల నమ్మకాలు అభ్యర్థుల్లో ఉంటాయి. ఇలాంటి వాటి కోవలోనే ఒక నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో అదే పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం కర్ణాటకలోని గదగ్ జిల్లాలో ఉన్న సిరాహట్టి నియోజకవర్గం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏ పార్టీ అయితే గెలుస్తుందో.. అదే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందన్న నమ్మకం జనాల్లో బలంగా నాటుకుపోయింది. అందుకు తగ్గట్టుగానే దాదాపు నాలుగు దశాబ్ధాలుగా.. ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో అదే రిజల్ట్ రిపీట్ అయ్యింది. ఈ సాంప్రదాయాన్ని నిజం చేస్తూ... సిరాహట్టిలో బీజేపీ అభ్యర్థి రామప్ప సోబెప్పలమాని తాజా ఎన్నికల్లో విజయం సాధించారు... ఇందుకు తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తలక్రిందులు చేస్తూ బీజేపీ ఎవరి మద్ధతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తోంది.