ఎంతో మందికి ఈ ఆస్పత్రి పునర్జన్మనిచ్చింది...

ఎంతో మందికి ఈ ఆస్పత్రి పునర్జన్మనిచ్చింది...

బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ ఏంతో మందికి పునర్జన్మని ఇచ్చిందని తెలిపారు హీరోయిన శ్రీయ... బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పటల్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె... మాట్లాడుతూ... అందరూ  రెగ్యులర్ గా మెడికల్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. బసవతారకం హాస్పిటల్ వేడుకల్లో పాల్గొనడంపై ఆనం వ్యక్తం చేసిన శ్రీయ... ఏంతో మందికి ఈ హాస్పిటల్ పునర్జన్మనిచ్చిందని అభినందించారు. 

ఎన్టీఆర్ ఒక బాధ్యతగా భావించి బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించారని వెల్లడించారు దర్శకుడు బోయపాటి... సంకల్ప బలం అద్భుతంగా ఉన్న ఒక శక్తి ఎన్టీఆర్ అని... ఎన్టీఆర్ ఆశయాలను బాలయ్య బాబు ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. ప్రపంచ దేశాలు తిరిగి కొత్త టెక్నాలజీని ఈ హాస్పిటల్ కి తీసుకొస్తున్నారు బాలయ్య అని గుర్తు చేసిన బోయపాటి... పది లక్షల రూపాయలను ఈ హాస్పిటల్ కి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. బసవ తారకం హాస్పిటల్ ఏషియాలోనే నెంబర్ హాస్పిటల్ గా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కవిత, ఆస్పత్రి చైర్మన్, ఎమ్మెల్సీ నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు.