సీఎం పదవికి సిద్దూ రాజీనామా

సీఎం పదవికి సిద్దూ రాజీనామా

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గానూ జేడీఎస్‌కు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించిన ఆయన తాజా పరిణామాలపై రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయి చర్చలు జరిపారు. తమ మద్ధతుతో జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని.. అందుకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా సిద్ధరామయ్య గవర్నర్‌ను కోరినట్లు సమాచారం.. అయితే ఆయన ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలని.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు సంయుక్తంగా గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంది.