హమ్మయ్య.. బాదామిలో సిద్ధరామయ్య నెగ్గాడు..

హమ్మయ్య.. బాదామిలో సిద్ధరామయ్య నెగ్గాడు..

బాదామి నియోజకవర్గంలో ఎట్టకేలకు సీఎం సిద్ధరామయ్య విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి శ్రీరాములు మొదట ఆధిక్యాన్ని కనబరిచినా... లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ.. సిద్దరామయ్య మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఈ బాదామి నియోజకవర్గంలో శ్రీరాములు, సిద్దరామయ్య మధ్య హోరాహోరిగా పోటీ నెలకొంది. మొత్తానికి బాదామి ప్రజల, నాయకుల ఉత్కంఠకు తెరపడేలా సిద్ధరామయ్య విజయాన్ని సాధించారు. బీజేపీ అభ్యర్థి బి. శ్రీరాములుపై 2150 ఓట్లతో సద్ధరామయ్య విజయాన్ని అందుకున్నారు. 

ఈసారి కర్ణాటక ఎన్నికలను సిద్ధరామయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల్లో కూకడా మొదట ట్రెండ్స్‌లో సీఎం సిద్ధారామయ్య వెనుకబడ్డారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో ఆరంభం నుంచి సిద్ధరామయ్య వెనుకంజలోనే ఉన్నారు. చాముండేశ్వరిలో సిద్ధరామయ్యపై జేడీఎస్‌ అభ్యర్థి జీటీ దేవెగౌడ మొదటిరౌండు నుంచి ఆధిక్యాన్ని కనబర్చారు. మొత్తానికి 25,861 ఓట్ల మెజారిటీతో సిద్దరామయ్యపై జీటీ దేవగౌడ గెలుపొందారు. దీంతో బాదామిలోనైనా సిద్ధరామయ్య నెగ్గుతాడా లేదా అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. బాదామిలో గెలుపొందడంతో కన్నడ కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది.