సింబా మరో రికార్డును కొట్టేసింది

సింబా మరో రికార్డును కొట్టేసింది

రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన సింబా సినిమా డిసెంబర్ 28 వ తేదీన రిలీజయింది.  రిలీజైన ఫస్ట్ రోజు నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.  సీరియస్ సినిమాలో రోహిత్ శెట్టి తనదైన మార్క్ కామెడీని మిక్స్ చేయడంతో పాటు సినిమాలో అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ వంటి నటులు గెస్ట్ రోల్స్ ప్లే చేయడంతో సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.  రిలీజైన మూడు రోజుల్లోనే వందకోట్ల రూపాయల క్లబ్ లో చేరిన ఈ సినిమా పదిరోజుల్లో రూ.200 కోట్ల రూపాయల మార్క్ ను టచ్ చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.  

పెద్ద సినిమాలు లేకవడం, డిసెంబర్ 21 వ తేదీన రిలీజైన జీరో సినిమా భారీ పరాజయం పాలవ్వడంతో సింబా కు కలిసి వచ్చింది.  రణ్వీర్ సింగ్, సారా ఆలీఖాన్ జంటగా నటించిన ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించారు.  టాలీవుడ్ లో సూపర్ హిట్టైన ఎన్టీఆర్ టెంపర్ సినిమాకు ఇది రీమేక్.