జాతీయ చాంపియన్‌షిప్‌లో సైనా, సింధు

జాతీయ చాంపియన్‌షిప్‌లో సైనా, సింధు

భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనున్నారు. ఈనెల 12 నుంచి గువాహటి వేదికగా జాతీయ చాంపియన్‌షిప్‌ టోర్నీ జరగనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌-50లో ఉన్న భారత టాప్‌ 8 షట్లర్లు సింగిల్స్‌ బరిలో ఉండగా.. డబుల్స్‌ నుంచి 4 జోడీలు పోటీపడుతున్నాయి. సైనా, సింధు టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. ఇక పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌, కిదాంబి శ్రీకాంత్‌ గాయాల కారణంగా టోర్నీకి దూరం అయ్యారు. సమీర్‌ వర్మ, పారుపల్లి కశ్యప్‌లు బరిలో ఉన్నారు. లక్ష్యసేన్‌ కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు.