ఆ రెండింటిని బాగా కవర్ చేసిందే..!!

ఆ రెండింటిని బాగా కవర్ చేసిందే..!!

ఒక్కసారి ఫెమసైతే చాలు  సోషల్ మీడియా ద్వారా కావాల్సినంత సంపాదించుకోవచ్చు అన్నది నేటితరం హీరోయిన్ల మాటలు ఇవి.  ఒక్క సినిమాలో నటించినా చాలు.. ఆ తరువాత పాపులర్ కావడానికి మార్గాలు అవే దొరుకుతుంటాయి.  2013లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని సాధించిన తెనాలి బ్యూటీ శోభిత ధూళిపాళ్ల.. అందాలకు ప్రదర్శించడంలో ఎలాంటి అడ్డు చెప్పడంలేదు.  ఎంతైనా కింగ్ ఫిషర్ క్యాలెండర్ పైకెక్కిన సుందరి కదా.  ఈ క్యాలెండర్ బ్యూటీ కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా చేసింది.  

తెలుగమ్మాయి కావడంతో.. ఈ అమ్మడికి గూఢచారి వంటి హిట్ సినిమాలో అవకాశం వచ్చింది.  వచ్చిన ఆ అవకాశాన్ని బాగానే యూజ్ చేసుకుంది.  ముంబైలో సెటిల్ కావడం వలన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తోంది.  రీసెంట్ గా బీచ్ ఒడ్డున కాళ్ళు చాపుకొని చేతిలో ఓ కప్పు పట్టుకొని కూర్చున్న ఫోటోను షేర్ చేసింది.  పొడుగ్గా ఉన్న అందమైన కళ్ళను సముద్రంవైపు జాపి కూర్చున్న ఫోటో అది.  లేలేత సూర్య కిరణాలు ఆమె కాళ్ళను తాకుతున్నాయి కాబోలు.. కాళ్ళు చాక్లెట్ కలర్లో మిలమిల మెరిసిపోతున్నాయి.  కాళ్ళు ఎదురుగ సముద్రం, చేతిలో ఒక కప్పు తప్పితే మరేమి కనిపించడం లేదు.  అయినప్పటికీ ఈ ఫోటోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  ఫోటోపై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తూ వైరల్ చేశారు.