సాఫ్ట్ వేర్ మహిళా ఉద్యోగి బలవన్మరణం

సాఫ్ట్ వేర్ మహిళా ఉద్యోగి బలవన్మరణం

హైదరాబాద్ మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. అఫ్జల్ నగర్ కాలనీలో నివాసముంటున్న మౌనిక అనే 33 సంవత్సరాల మహిళా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మౌనిక గత 18 నెలలుగా భర్తకు దూరంగా ఉంటుందని, కుటుంబ కలహాలతోనే మరణించినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు.