బీజేపీ నేతలే రెచ్చగొడుతున్నారు...

బీజేపీ చీఫ్ అమిత్‌షాకు తిరుపతిలో ఎదురైన ఘటనపై ఏపీ టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది... చంద్రబాబు ప్రోత్సాహంతోనే దాడి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తే... అటు బీజేపీ నేతలే టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతున్నారంటూ విమర్శించారు మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... అమిత్‌షా కాన్వాయ్‌పై దాడిని ఖండించిన సోమిరెడ్డి... బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు... ఈ నెల 15వ తేదీ తర్వాత ఏపీలో టీడీపీ సంగతి తేలుస్తామని ఆయన వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టిన సోమిరెడ్డి... రాష్ట్ర హక్కుల కోసం పోరాడితే అంతు చూస్తారా? అంటూ మండిపడ్డారు... ఈ సందర్భంగా చినరాజప్ప, సోమిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...