కమల్ సినిమాలో కొరియన్ హీరోయిన్ !

కమల్ సినిమాలో కొరియన్ హీరోయిన్ !

కమల్ హాసన్ త్వరలో స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో 'ఇండియన్ 2' సినిమాను మొదలుపెట్టనున్నాడు.  భారీ హంగులతో రూపొందనున్న ఈ సినిమా కోసం దక్షిణాది సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తుండగా సౌత్ కొరియన్ హీరోయిన్ భే సూజి కూడ ఒక ముఖ్య పాత్రలో నటించనుందట.  తైవాన్ దేశంలో రూపొందించనున్న కొన్ని సన్నివేశాల కోసం సూజిని తీసుకున్నారట శంకర్.  1996లో వచ్చిన 'ఇండియన్' సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది.