ట్రాఫిక్ చలాన్లు కట్టలేకపోతున్న సినీ హీరోలు

ట్రాఫిక్ చలాన్లు కట్టలేకపోతున్న సినీ హీరోలు

టాలివుడ్ అగ్రకథానాయకులు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. చెల్లించాల్సిన చలాన్లు గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నా.. వాటిని మాత్రం చెల్లించే తీరిక దొరకడంలేదు. నందమూరి బాలకృష్ణ, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌లాంటి అగ్ర హీరోలు ఓవర్‌స్పీడ్‌తో వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో వీరి ఖాతాల్లో చలాన్లు పేరుకుపోయాయి. వీరిలో అత్యధికంగా మహేష్‌ బాబు పేరిట 7సార్లు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను రూ.8,745 పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని 2016 నుంచి మహేష్‌ కట్టలేకపోతున్నారు. నందమూరి బాలకృష్ణ 2018లో రాజేంద్రనగర్‌ వద్ద అతివేగంతో పయనించడంతో రూ.1,035 ఫైన్‌ వేశారు. పవన్‌ కళ్యాణ్‌ పార్కింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మూడు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2016 నుంచి ఆయన ఈ రూ.505 ఫైన్‌ను చెల్లించలేకపోతున్నారు. సునీల్‌, నితిన్‌ లాంటి హీరోల చలాన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. పది చలాన్లు మించి పెండింగ్‌లో ఉన్నట్లైతే వాహనాలను సీజ్‌ చేస్తామంటూ హైదరాబాద్‌ అదనపు ట్రాఫిక్‌ కమీషనర్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు.