82 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన పాక్ స్పిన్నర్

82 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన పాక్ స్పిన్నర్

పాకిస్థాన్ లెగ్ స్నిన్న‌ర్ యాసిర్ షా టెస్టు క్రికెట్‌లో స‌రికొత్త రికార్డును నమోదు చేసాడు. అతి త‌క్కువ టెస్టు మ్యాచుల్లో 200 వికెట్లు తీసుకున్న బౌల‌ర్‌గా రికార్డు నెల‌కొల్పాడు. దీంతో 82 ఏళ్ల రికార్డును షా బ్రేక్ చేశాడు. దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టు నాలుగవ రోజు కివీస్ ఆటగాడు సోమ‌ర్‌విల్లే వికెట్ తీయడంతో.. యాసిర్ షా ఈ రికార్డును అందుకున్నాడు. షా 33వ  టెస్టులోనే 200 వికెట్లు తీసాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియా లెగ్ స్నిన్న‌ర్ క్లేరీ గ్రిమ్మెట్ 36 టెస్టు మ్యాచుల్లో 200 వికెట్లు తీసాడు. టెస్టుల్లో అతి త్వ‌ర‌గా (9 టెస్టు మ్యాచుల్లో) 50 వికెట్లు తీసుకున్న  బౌల‌ర్‌గా కూడా యాసిర్ షానే. అయితే అతి త్వ‌ర‌గా (17 టెస్టు మ్యాచుల్లో) 100 వికెట్లు తీసుకున్న బౌల‌ర్‌ల జాబితాలో మాత్రం రెండవ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇప్ప‌టికే యాసిర్ షా 27 వికెట్లు తీసుకున్నాడు.