గన్‌తో కాల్చుకుని బాబా ఆత్మహత్య...

గన్‌తో కాల్చుకుని బాబా ఆత్మహత్య...

మధ్యప్రదేశ్‌లో గన్‌తో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నా ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు భయ్యూ మహారాజ్... ఉదయ్ సింగ్ దేశ్‌ముఖ్ అలియాస్ భయ్యూ మహారాజ్‌గా పిలువబడే ఈ యన ఇండోర్‌లో తలపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే ఇండోర్‌లోని బాంబే ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది... కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారం సాగుతోంది. 

ఆధ్యాత్మిక గురువుగా రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ప్రముఖ గాయని లతా మంగేష్కర్లకు ఆయన అత్యంత సన్నిహితుడుగా చెబుతున్నారు. ఇక భయ్యూ మహారాజ్ 2011లో అన్నా హజారే, అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ప్రచారంలో ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారు. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ సర్కార్‌లో మంత్రిగా హోదా ఇచ్చిన ఐదుగురు మత గురువుల్లో భయ్యూ మహారాజ్ ఒకరు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో మంచిపేరు సంపాదించారాయన. ఈ వార్త విన్న ఆయన మద్దతుదారులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి దగ్గరకు చేరుకున్నారు.