నాగ్-నాని కోసం బాలీవుడ్ డైరెక్టర్!

నాగ్-నాని కోసం బాలీవుడ్ డైరెక్టర్!

అక్కినేని నాగార్జున, నాని ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు కావల్సినంత బజ్ క్రియేట్ అయింది. నాగ్, నాని సందర్భం దొరికిన ప్రతిసారి ఈ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త హల్చల్ చేస్తోంది. నిజానికి ఈ సినిమాకు కథ అందించింది శ్రీరామ్ ఆదిత్య కాదట. బాలీవుడ్ రైటర్, డైరెక్టర్ అయిన శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమా కోసం కథ రాసినట్లు టాక్. 

అంతేకాదు ఈ మల్టీస్టారర్ కథ శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన 'జానీ గద్దర్' కు దగ్గరగా ఉంటుందని అంటున్నారు. సిడ్నీషెల్డన్ క్రైమ్ స్టోరీస్ ను ఇష్టపడే ఈ దర్శకుడిపై వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తదుపరి షెడ్యూల్ కోసం చిత్రబృందం ఫారిన్ కు వెళ్లనుంది. రష్మిక, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.