శ్రీశైలం దేవస్థానం ఏఈవో పై వేటు

శ్రీశైలం దేవస్థానం ఏఈవో పై వేటు

కర్నూలు  జిల్లా శ్రీశైలం దేవస్థానం ఏఈఓ మోహన్ ను సస్పెన్షన్ వేటు పడింది.డిసెంబరు 25న గంగాసదన్ పైన జరిగిన క్రిస్మస్ వేడుకల వెనుక ఏఈవో హస్తముందని ఆరోపణలు వచ్చాయి. దాంతో విచారణ జరిపిన  దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్,  అన్యమత వేడుకలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. శాఖపరమైన నిర్ణయం తీసుకున్న దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ .. ఏఈఓ మోహన్ ను సస్పెండ్ చేయాలని శ్రీశైలం ఆలయం ఈవో శ్రీరామచంద్రమూర్తి ఆదేశించారు. ఆ మేరకు ఏఈవో మోహన్ తక్షణమే విధులను నుంచి తప్పించారు ఈవో శ్రీరామచంద్రమూర్తి.