మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

గిరిజనులకు 50 ఏళ్ల నుంచే వృద్ధాప్య ఫించన్ ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైల్ కు ఆదివారం సీఎం ఆమోదముద్ర వేశారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది గిరిజనులు లబ్ధి పొందనున్నారు. ఎక్కువ మంది గిరిజనులు పోషకాహార లోపం, సరైన వైద్య సౌకర్యాలకు నోచుకోకపోవడంతో 50 ఏళ్లకే వారి ఆరోగ్యం దెబ్బతింటుందని జాతీయ కుటంబ ఆరోగ్య సర్వే ఆధారంగా ప్రభుత్వం గమనించింది. వారి ఆర్ధిక, సామాజిక పరిస్థితులను బట్టి పెన్షన్ అర్హత పొందే వయసును 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గిస్తామని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు ప్రకటించారు. దానికి అనుగుణంగా ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నారు.