సిక్స్ ప్యాక్ తో దర్శనమిస్తున్న మరొక స్టార్ కమెడియన్ !

సిక్స్ ప్యాక్ తో దర్శనమిస్తున్న మరొక స్టార్ కమెడియన్ !

మన దక్షిణాదిన స్టార్ కమెడియన్లుగా వెలుగొందిన చాలా మంది నటులు ఒక్కోసారి ఉన్నట్టుండి లుక్ మార్చేసి హీరోల లెవల్లో కనిపిస్తుంటారు.  కొందరైతే ఏకంగా హీరోలే అయిపోయారు కూడ.  అందుకు ఉదాహరణ తెలుగులో సునీల్, తమిళంలో సంతానం.

ఇప్పుడు వీరి జాబితాలోకి చేరాలనుకుంటున్నాడు కోలీవుడ్ కమెడియన్ సూరి.  ప్రతి తమిళ స్టార్ హీరో సినిమాలోనూ కనిపిస్తూ స్టార్ కమెడియన్ గా చలామణీ అవుతున్న ఈయన ఉన్నట్టుండి దాదాపు సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చాడు.  ప్రస్తుతం ఈ ఫోటో షోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఈయన చేసిన హార్డ్ వర్కుకు చాలా మంది ప్రేక్షకులు మెచ్చుకుంటుండగా ఇంకొందరు ఈయన కూడ హీరోగా మారాలని ట్రై చేస్తున్నారా ఏంటి అని అడుగుతున్నారు.