రామ్ చరణ్ కోసం మరొక స్టార్ హీరోయిన్ !

రామ్ చరణ్ కోసం మరొక స్టార్ హీరోయిన్ !

 

స్టార్ హీరోల సినిమాల్లో స్టార్ హీరోయిన్ల ప్రత్యేక గీతాలకు డిమాండ్ బాగా పెరిగింది.  అందుకే పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేసేప్పుడు ఇలాంటి పాట ఒకటి ఉండేలా చూసుకుంటున్నారు దర్శకులు.  ఆ దర్శకుల జాబితాలో బోయపాటి శ్రీను కూడ ఒకరు.  దాదాపు చేసిన ప్రతి సినిమాలో ప్రముఖ హీరోయిన్ చేత ఒక స్పెషల్ సాంగ్ చేయించిన ఈయన ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాలో సైతం అలాంటి పాటే ఒకటి ప్లాన్ చేశారట. 

పేరు బయటకు రాలేదు కానీ ఇందులో స్టార్ హీరోయిన్ చరణ్ తో కలిసి స్టెప్పులేస్తుందని తెలుస్తోంది.   మరి ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.  దానయ్య నిర్మిస్తున్న ఈ హెవీ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్లో కైరా అద్వానీ కథానాయకిగా నటిస్తోంది.  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకానుంది.