కారు ప్రమాదానికి కారణమైన స్టార్ హీరో కుమారుడు !

 కారు ప్రమాదానికి కారణమైన స్టార్ హీరో కుమారుడు !

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కారు ప్రమాదానికి కారణమయ్యారు.  చెన్నైలో ఈరోజు ఆదివారం తెల్లవారుజామున ఈ కారు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.  ధృవ్ కారు రోడ్డు పక్కనే నిలబెట్టి ఉన్న మూడు ఆటోల మీదికి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

ఇందులో ఒక ఆటో డ్రైవర్ స్వల్పంగా గాయపడగా ధృవ్ విక్రమ్ కు ఎలాంటి అపాయం కలుగలేదట.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.  ఇకపోతే ధృవ్ తెలుగు సూపర్ హిట్ సినిమా 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ తో వెండి తెరకు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.