రేపు రాజకీయ పార్టీలతో రజత్ కుమార్ భేటీ

రేపు రాజకీయ పార్టీలతో రజత్ కుమార్ భేటీ

రాజకీయ పార్టీలతో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సమావేశం కానున్నారు. నవంబర్ 12న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సచివాలయంలోని ఈసీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు విషయాలను రాజకీయ పార్టీల అధికారులతో చర్చిస్తారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని రాజకీయ పార్టీలను రజత్ కుమార్ కోరనున్నారు.