స్టేషన్ ఘన్ పూర్ లో టీఆర్ఎస్ దే విజయం

స్టేషన్ ఘన్ పూర్ లో టీఆర్ఎస్ దే విజయం

కేసీఆర్ పట్ల ఇష్టం ఉన్నవాళ్లు, కడియం శ్రీహరి అంటే అభిమానం ఉన్న వాళ్లంతా రాజయ్య అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించాలని కడియం శ్రీహరి కోరారు. రాజయ్య కూడా అందరిని కలుపుకొని పోవాలని ఆయనకు కడియం సూచన చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని స్పష్టం చేశారు. మనం అందరం కలిస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. రాజయ్యకు తన పూర్తి సహాకారం ఉంటుందన్నారు. తనను అభిమానించే వారందరూ పూర్తిస్థాయిలో రాజయ్యకు సహకరించాలి. రాజయ్య వర్గీయులు, తన వర్గీయులు, ఉద్యమకారులంతా కలిసి స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగురవేయాలని కడియం కోరారు.